పంచాయతీల్లో ఆస్తిపన్నుపై 5 శాతం రిబేటు
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:47 AM
గ్రామ పంచాయతీల్లో 2026-27కు సంబంధించిన ఆస్తిపన్నును మే నెలాఖరులోపు చెల్లించేవారికి 5 శాతం రిబేటు ఇవ్వనున్నారు.
అమరావతి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో 2026-27కు సంబంధించిన ఆస్తిపన్నును మే నెలాఖరులోపు చెల్లించేవారికి 5 శాతం రిబేటు ఇవ్వనున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తి పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం ఆస్తిపన్నును వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు చెల్లించేందుకు అవకాశం ఉంది. అయితే, ముందుగానే పన్ను చెల్లించేవారికి.. మొత్తం పన్నుల్లో 5 శాతం రిబేటు ఇస్తారు.