Share News

బయో వ్యర్థాలపై నివేదికివ్వండి: సత్యకుమార్‌

ABN , Publish Date - May 17 , 2026 | 05:28 AM

బోధనాసుపత్రుల్లో బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ పరిస్థితిపై యథాస్థితి నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంట్లను ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ ఆదేశించారు.

బయో వ్యర్థాలపై నివేదికివ్వండి: సత్యకుమార్‌

  • విజయవాడ ఘటన నేపథ్యంలో సీఎస్ఆర్‌ఎంవోకు షోకాజ్‌ నోటీసులు

  • శానిటేషన్‌ ఉద్యోగి విధుల నుంచి తొలగింపు

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): బోధనాసుపత్రుల్లో బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ పరిస్థితిపై యథాస్థితి నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంట్లను ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ ఆదేశించారు. వివరణాత్మక నివేదికను సోమవారం నాటికి పంపాలని సృష్టం చేశారు. ‘ఆసుపత్రుల సూపరింటెండెంట్లు బయో మెడికల్‌ వ్యర్థాల తరలింపు విధానాన్ని వ్యక్తిగతంగా ప్రతిరోజూ నిశితంగా పరిశీలించాలి. వ్యర్థాలను స్టోరేజ్‌ రూముల నుంచి ఎప్పటికప్పు డు తొలగించాలి’ అని ఆదేశించారు. విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రులో శస్త్రచికిత్స అనంతరం రోగి నుంచి తొలగించిన కాలి భాగాన్ని శునకం నోట కరుచుకుని తిరగడా న్ని మంత్రి సీనియర్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ లోపం కింద సీఎ్‌సఆర్‌ఎంవోకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. శానిటేషన్‌ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. వ్యర్థాల తరలింపును నిర్వహిస్తున్న ప్రయివేటు సంస్థలకు నోటీసులు జారీ చేశారు.

Updated Date - May 17 , 2026 | 05:29 AM