ఆయిల్‌పామ్ రైతులకు అదనపు లబ్ధి: అచ్చెన్న
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:07 AM
ఆయిల్‌పామ్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణ కన్నా ఏపీలోనే రైతులకు అధిక ధర లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణ కన్నా ఏపీలోనే రైతులకు అధిక ధర లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర కోసం కూటమి ప్రభుత్వం తాజా పండ్లలో చమురు నిష్పత్తి 20.01 శాతానికి పెంచినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి నెలకు తెలంగాణలో టన్ను ఆయిల్‌పామ్‌కు రూ.20,456 లభించిందని.. ఏపీలో రికార్డు స్థాయిలో రూ.20,860 వచ్చిందని చెప్పారు. ఆయిల్‌పామ్ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీవీ రాఘవరావు ఆధ్వర్యంలో రైతు నాయకులు మంత్రిని కలిసి ధర పెంపు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.