Share News

పట్టణాల్లో ఖాళీ స్థలాలకు పన్ను రాయితీ

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:32 AM

రాష్ట్రంలోని పట్టణాల్లో నిర్మాణ కార్యకలాపాలకు ఊతమివ్వడం, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పట్టణాల్లో ఖాళీ స్థలాలకు పన్ను రాయితీ

  • నిర్మాణాలు ప్రారంభించాక 50శాతం చెల్లిస్తే చాలు

  • మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు

  • నిర్మాణ కార్యకలాపాలు, రియల్‌ ఎస్టేట్‌కు ప్రోత్సాహం లక్ష్యం

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణాల్లో నిర్మాణ కార్యకలాపాలకు ఊతమివ్వడం, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్థలాలపై విధించే వీఎల్‌టీ(వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌)పై నిర్మాణ కాలంలో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. చట్టబద్ధంగా భవన నిర్మాణ అనుమతి పొందిన స్థలాల యజమానులకు ఈ రాయితీ వర్తిస్తుంది. నిర్మాణం కొనసాగుతున్నంత కాలం ఖాళీ భూముల పన్నులో 50 శాతం మాత్రమే వారు చెల్లించాల్సి ఉంటుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ, నిర్మాణం పూర్తయినట్లు ధ్రువీకరణ, అనుమతి గడువు ముగింపు, పొడిగించిన గడువు ముగింపు దాకా ఈ రాయితీ అమల్లో ఉంటుంది. ఈ రాయితీని పూర్తిగా డిజిటల్‌ విధానంలో అమలు చేస్తారు. అయితే, అనధికార నిర్మాణాలు, చట్టబద్ధ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు ఈ రాయితీ వర్తించదు.

Updated Date - Apr 22 , 2026 | 04:32 AM