నో వెహికిల్‌డే... సైకిలెక్కిన మంత్రి నిమ్మల
ABN , Publish Date - May 16 , 2026 | 05:18 AM
సీఎం చంద్రబాబు పొదుపు పిలుపునకు సహచర మంత్రులు, శాసనసభ్యుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఇంటర్నెట్ గ్యాస్: సీఎం చంద్రబాబు పొదుపు పిలుపునకు సహచర మంత్రులు, శాసనసభ్యుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వారానికోరోజు ‘నో వెహికిల్ డే’ పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు సైకిల్ సవారీకి సిద్ధమయ్యారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు శుక్రవారం పార్టీ కార్యక్రమాలకు నియోజకవర్గంలో సైకిల్‌పైనే హాజరయ్యారు. మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ బందరు రోడ్డులోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం వరకూ... దాదాపు 10 కిమీ సైకిల్‌పై వెళ్లారు. సూర్యుడు తన ప్రతాపంతో మంట మండిస్తున్న వేళ, మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరిన నిమ్మల... 3.45 గంటలకు ఉండవల్లి సీఎం నివాసానికి చేరుకున్నారు. పోలవరం నిర్వాసితులకు రూ.307 కోట్ల పరిహారం చెల్లింపు కార్యక్రమానికి హాజరై... తిరిగి సైకిల్‌పైనే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.