Share News

పట్టణ స్థానిక సంస్థల్లో 736 కొత్త వార్డులు

ABN , Publish Date - May 19 , 2026 | 04:52 AM

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో వార్డుల డీలిమిటేషన్‌ ప్రక్రియ కొలిక్కి వచ్చింది.

పట్టణ స్థానిక సంస్థల్లో 736 కొత్త వార్డులు

  • వార్డుల డీలిమిటేషన్‌ ముసాయిదా సిద్ధం

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో వార్డుల డీలిమిటేషన్‌ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. వార్డుల విభజన ప్రక్రియను పూర్తిచేసి ముసాయిదాను సిద్ధం చేశారు. 100 పట్టణ స్థానిక సంస్థల్లో 3,206 వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. కొత్తగా 736 వార్డులు పెరిగాయి. దీంతో వార్డుల సంఖ్య 3,942కు పెరిగింది. దీనిపై అభ్యంతరాలుంటే ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిశీలిస్తారు. షెడ్యూల్‌ ప్రకారం మున్సిపల్‌శాఖ ఈ నెల 28 నుంచి తుది జాబితా ప్రకటించనుంది.

Updated Date - May 19 , 2026 | 04:53 AM