మున్సిపల్ వార్డులు, డివిజన్ల డీలిమిటేషన్‌కు రీషెడ్యూల్
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:50 AM
పట్టణ స్థానిక సంస్థల్లోని వార్డు డీలిమిటేషన్ ప్రక్రియ షెడ్యూల్‌ను రివైజ్ చేస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలిచ్చింది.
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల్లోని వార్డు డీలిమిటేషన్ ప్రక్రియ షెడ్యూల్‌ను రివైజ్ చేస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో జనగణన ప్రక్రియ ప్రారంభమైనందున డివిజన్లు, వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని అధికారులు కోరడంతో ఆ శాఖ ఆ మేరకు చర్యలు తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్లు, వార్డులు, డివిజన్లకు డ్రాఫ్టు సిద్ధం చేసేందుకు గడువును ఏప్రిల్ 2 నుంచి 26 వరకు, ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ప్రకటించేందుకు ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు, వార్డులు, డివిజన్లు తుది ఖరారు చేసి సీడీఎంఏకు సమర్పించేందుకు మే4నుంచి15కు, డీలిమిటేషన్ వార్డులను సీడీఎంఏ పరిగణించేందుకు మే16 నుంచి27కు, తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు మే 28 నుంచి 30 తేదీ వరకు నిర్ణయిస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలిచ్చింది.