Share News

ఖరీఫ్‌ సన్నద్ధతపై నేడు మంత్రుల సమీక్ష

ABN , Publish Date - May 18 , 2026 | 04:56 AM

రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగుపై సోమవారం ప్రభుత్వం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నది. రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, జలవనరుల శాఖ మంత్రులు..

ఖరీఫ్‌ సన్నద్ధతపై నేడు మంత్రుల సమీక్ష

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగుపై సోమవారం ప్రభుత్వం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నది. రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, జలవనరుల శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో ఖరీఫ్‌ సన్నాహాలు, సాగునీటి లభ్యత, విత్తన పంపిణీ, ఎరువుల నిల్వలు తదితర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గనున్న నేపథ్యంలో సాగునీటి సరఫరా, వినియోగంపై అధికారులకు మంత్రులు కీలక సూచనలు చేయనున్నారు.

Updated Date - May 18 , 2026 | 05:58 AM