Share News

రెండో రోజు సింగపూర్‌లో ఏపీ మంత్రులు

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:54 AM

సింగపూర్‌కు వెళ్లిన ఏపీ మంత్రులు బుధవారం కూడా అక్కడ శిక్షణ, అధ్యయన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. నేషన్‌ ఫస్ట్‌ గవర్నెన్స్‌, ...

రెండో రోజు సింగపూర్‌లో ఏపీ మంత్రులు

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): సింగపూర్‌కు వెళ్లిన ఏపీ మంత్రులు బుధవారం కూడా అక్కడ శిక్షణ, అధ్యయన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. నేషన్‌ ఫస్ట్‌ గవర్నెన్స్‌, రాజకీయ జవాబుదారీతనంపై శిక్షణలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్‌రెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్‌, అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ బృందం పాల్గొంది. ఉదయం సింగపూర్‌ హోంమంత్రి షణ్ముగంతో మంత్రులు భేటీ అయ్యారు. సమర్థవంతమైన నాయకత్వం అందించడం, ప్రభుత్వ యంత్రాంగమంతా కలిసి సమన్వయంతో పనిచేసే విధానం వంటి అంశాలపై చర్చ జరిగింది. గడచిన 50 ఏళ్లలో సింగపూర్‌ అభివృద్ధి చెందిన విధానం, భవిష్యత్‌ ప్రణాళికలతో ఉన్న గేలరీని మంత్రులు సందర్శించారు. సింగపూర్‌ ప్రధాని స్ట్రాటజీ గ్రూప్‌లో భాగంగా ఉన్న సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ ఫ్యూచర్స్‌ సంస్థను, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ సిటీ్‌సను సందర్శించారు. ఆధునిక నగరాల అభివృద్ధి, భవిష్యత్తు సవాళ్లపై ఈ వర్సిటీ పనిచేస్తోంది. దీర్ఘకాలిక పట్టణ ప్రణాళిక, భూవినియోగ పాలన, ప్రభుత్వ శాఖలు- సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలపై సింగపూర్‌ ప్రతినిధులు వివరించారు.

Updated Date - Apr 23 , 2026 | 03:54 AM