Share News

మత్స్యకారులను మభ్యపెడుతున్న వైసీపీ: అచ్చెన్న

ABN , Publish Date - May 20 , 2026 | 06:05 AM

మత్స్యకారుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుంటే.. వైసీపీ నేతలు అబద్దాలతో మత్స్యకారులను మభ్యపెడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

మత్స్యకారులను మభ్యపెడుతున్న వైసీపీ: అచ్చెన్న

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుంటే.. వైసీపీ నేతలు అబద్దాలతో మత్స్యకారులను మభ్యపెడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మత్స్యకారుల విషయంలో జగన్‌ పత్రికలో విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం మంత్రి ఒక ప్రకటన చేస్తూ.. మత్స్యకారుల సంక్షేమంపై వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాగా మత్స్యకారులకు రూ.20వేలు చొప్పున నిధులు విడుదల చేయడంపై ఏపీ ఫిషర్‌మెన్‌ కో ఆపరేటీవ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ యాటగిరి రాంప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - May 20 , 2026 | 06:07 AM