కులచిచ్చు జగన్ డీఎన్‌ఏలోనే: అనగాని
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:29 AM
కులమతాల మధ్య చిచ్చుపెట్టడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ డీఎన్‌ఏలోనే ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): కులమతాల మధ్య చిచ్చుపెట్టడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ డీఎన్‌ఏలోనే ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘హైదరాబాద్ సుభిక్షంగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చుపెట్టిన ఘనత జగన్ తండ్రిది. అదే ఆనవాయితీని జగన్ కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లి పార్లమెంటు సాక్షిగా ప్రెస్‌మీట్ పెట్టారు. 38 మంది డీఎస్పీలకు పద్నోతులు ఇస్తే అందులో 35 మంది కమ్మ సామాజికవర్గం వారేనంటూ పచ్చిగా అబద్ధాలు ఆడారు. అబద్ధాల పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ. తాజాగా రాష్ట్రంలో ఏ ఘటన చోటుచేసుకున్నా దానికి కులం రంగు పులిమేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్, చంద్రయ్యను నిర్దాక్షణ్యంగా పొట్టన పెట్టుకున్నప్పుడు వారికి కులాలు గుర్తుకు రాలేదా?’ అని అనగాని ప్రశ్నించారు.