రైతుల్ని బలవంతం చేస్తే కఠిన చర్యలు: అచ్చెన్న
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:20 AM
ఎరువులు విక్రయాల్లో అక్రమాలకు తావు లేదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.ఎరువుల అమ్మకంతోపాటు బలవంతంగా లింక్ ప్రొడక్ట్స్ అండగడితే వ్యాపారులపై..
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ఎరువులు విక్రయాల్లో అక్రమాలకు తావు లేదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎరువుల అమ్మకంతోపాటు బలవంతంగా లింక్ ప్రొడక్ట్స్ అండగడితే వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులు, డీలర్ల సంఘాల సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు అవసరానికి మించి ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా యూరియాకు కొరత లేదని, రైతులకు సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. అవసరం లేని ఉత్పత్తులు కొనుగోలు చేయాలని రైతులను ఒత్తిడి చేస్తే సహించబోమని, ఇలాంటి డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టి, సంబంధిత కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్‌నినో పరిస్థితులపై రైతుల్ని అప్రమత్తం చేస్తూ.. ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. ‘ఎల్‌నినోను సమర్ధంగా ఎదుర్కొందాం’ అనే ప్రత్యేక సమాచార సంచికను మంత్రి ఆవిష్కరించారు..