Share News

ఇక దేశీయ డయలైజర్లు!

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:11 AM

విశాఖపట్నం ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ మరో ఘనతను దక్కించుకుంది. కిడ్నీ రోగుల డయాలసి్‌సకు అవసరమైన డయలైజర్ల దేశీయ తయారీకి సిద్ధమైంది.

ఇక దేశీయ డయలైజర్లు!

  • ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ మరో ఘనత

విశాఖపట్నం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ మరో ఘనతను దక్కించుకుంది. కిడ్నీ రోగుల డయాలసి్‌సకు అవసరమైన డయలైజర్ల దేశీయ తయారీకి సిద్ధమైంది. ‘డయలైజర్‌’ పరికరాలను ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో వ్యయం అధికంగా ఉంటోంది. వైద్యరంగానికి అవసరమైన పరికరాలను దేశీయంగా తయారు చేసి తక్కువ ధరకు అందించే లక్ష్యంతో ఏర్పాటైన మెడ్‌టెక్‌ జోన్‌లో డయలైజర్‌ తయారీకి ‘డయాసేవ్‌’ సంస్థ 2024 జూన్‌లో శ్రీకారం చుట్టింది. డయాసేవ్‌ గిగా ఫ్యాక్టరీ పేరుతో ఏడాదికి 40 లక్షల యూనిట్ల డయలైజర్ల తయారీ సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేసింది. ఇది ఉత్పత్తికి సిద్ధమైందని మెడ్‌టెక్‌ జోన్‌ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 25 , 2026 | 05:13 AM