Share News

మామిడి నాణ్యత లేకే ధర తగ్గి ఉండొచ్చు: ఉద్యాన శాఖ

ABN , Publish Date - May 05 , 2026 | 06:52 AM

నాణ్యత తగ్గడం వల్లే మామిడి ధరలు తగ్గి ఉండొచ్చని ఉద్యాన శాఖ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మామిడి నాణ్యత లేకే ధర తగ్గి ఉండొచ్చు: ఉద్యాన శాఖ

ఇబ్రహీంపట్నం, మే 4(ఆంధ్రజ్యోతి): నాణ్యత తగ్గడం వల్లే మామిడి ధరలు తగ్గి ఉండొచ్చని ఉద్యాన శాఖ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మామిడి ధర ఢమాల్‌ - రైతులు కుదేల్‌’ శీర్షికన ఈ నెల 4న ప్రచురితమైన కథనానికి ఉద్యాన శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 22,896 హెక్టార్లలో రైతులు మామిడి సాగు చేశారని, నల్లి తామర ఉధృతి వల్ల తోటల్లో పూత దెబ్బతిన్నదని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 20-25 శాతం దిగుబడులు తగ్గాయన్నారు. కోతల తొలి రోజుల్లో కాయలకు మంచి రేటు వచ్చిందని, రైతులకు నష్టాలు రాలేదన్నారు. తోతాపురి రకానికి మసి, రాతి మంగు ఎక్కువ ఉండటం వల్ల మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లోని మామిడి మార్కెట్లలోకి తెలంగాణ, రాయలసీమ మామిడి కాయలు రావడం వల్ల.. ఎన్టీఆర్‌ జిల్లాలో మామిడి ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

Updated Date - May 05 , 2026 | 06:53 AM