Share News

ప్రతినెలా 100 కోట్ల లంచాలు!

ABN , Publish Date - Mar 08 , 2026 | 06:52 AM

‘ప్రతినెలా రూ.100 కోట్లు కిక్‌ బ్యాక్‌లు... రూ.3,500 కోట్ల మనీ లాండరింగ్‌... రూ.1048 కోట్ల అక్రమ ఆర్థిక లావాదేవీలు..

ప్రతినెలా 100 కోట్ల లంచాలు!

  • 3,500 కోట్ల మనీలాండరింగ్‌.. 1,048 కోట్ల అక్రమ ఆర్థిక లావాదేవీలు

  • మద్య నిషేధం వెనకున్న నిజమైన కథ ఇదేనా జగన్‌..!: మంత్రి లోకేశ్‌

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘ప్రతినెలా రూ.100 కోట్లు కిక్‌ బ్యాక్‌లు... రూ.3,500 కోట్ల మనీ లాండరింగ్‌... రూ.1048 కోట్ల అక్రమ ఆర్థిక లావాదేవీలు... ఇదా మీ 2019 మద్య నిషేధం హామీ వెనుక ఉన్న నిజమైన కథ వైఎస్‌ జగన్‌..!’ అని మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఈడీ తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ లోకేశ్‌ ఎక్స్‌లో స్పందించారు. ‘మీరు మద్య నిషేధం గురించి ప్రవచనాలు చెబుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో చట్టవిరుద్ధ మద్యం వేలాది కుటుంబాలను నాశనం చేసింది. మరోవైపు మీ సన్నిహితుల జేబులు రూ.వేల కోట్లతో నిండిపోయాయి. మీ మద్యం దోపిడీపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్తారా? లేక రక్షణ కోసం మౌనాన్నే ఆశ్రయిస్తారా?’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.

Updated Date - Mar 08 , 2026 | 06:52 AM