Share News

పోర్టుల పరిధి కుదింపు

ABN , Publish Date - Jun 30 , 2026 | 06:05 AM

పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం ఉత్తర్వు జారీ చేశారు.

పోర్టుల పరిధి కుదింపు

  • 15కి.మీ. పరిమితం చేస్తూ ఉత్తర్వు

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిధిని కూడా 15 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇప్పటిదాకా పోర్టుల వ్యాపార పరిధి 20 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటోంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నెలకొల్పాలనుకుంటున్న నేపథ్యంలో పరిధిని కుదించడం ద్వారా వాటి నిర్వహణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Jun 30 , 2026 | 06:05 AM