Share News

వివిధ శాఖల పద్దులకు శాసనసభ ఆమోదం

ABN , Publish Date - Feb 26 , 2026 | 04:25 AM

వివిధ శాఖలకు నిధుల కోసం సంబంధిత మంత్రులు ప్రతిపాదించిన పద్దుల (డిమాండ్లు)పై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది.

వివిధ శాఖల పద్దులకు శాసనసభ ఆమోదం

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): వివిధ శాఖలకు నిధుల కోసం సంబంధిత మంత్రులు ప్రతిపాదించిన పద్దుల (డిమాండ్లు)పై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. రోడ్లు, భవనాల శాఖకు రూ.9,977.71 కోట్లు, రవాణా శాఖకు 268.54 కోట్లు, దేవదాయ శాఖకు రూ.248.57 కోట్లు, గవర్నర్‌, మంత్రిమండలికి రూ.37.60 కోట్లు, సాధారణ పరిపాలన, ఎన్నికల నిర్వహణకు సుమారు రూ.824.50 కోట్లు, ఆర్థిక పరిపాలన, ప్రణాళికలు, సర్వేలు, గణాంకాల శాఖకు రూ.40,953.13 కోట్లు, వాణిజ్య పన్నుల శాఖకు రూ.474.02 కోట్లు, రాష్ట్ర శాసన వ్యవస్థకు సుమారు రూ.162.13 కోట్లకు మించకుండా నిధులు మంజూరు చేయాలని మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌ కోరారు. ప్రతిపాదించిన డిమాండ్లపై ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై సంబంధిత మంత్రులు సమాధానాలిచ్చారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు అన్ని డిమాండ్ల ఆమోదానికి ఓటింగ్‌ నిర్వహించగా.. సభ ఏకగీవ్రంగా ఆమోదం తెలిపింది.

Updated Date - Feb 26 , 2026 | 04:26 AM