Share News

రాష్ట్రంలో వారసత్వ కట్టడాల నిర్వహణకు ప్రత్యేక పాలసీ

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:41 AM

రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాల పరిరక్షణ, నిర్వహణ కోసం ‘స్మారక చిహ్న మాన్యుమెంట్‌ పాలసీ’ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

రాష్ట్రంలో వారసత్వ కట్టడాల నిర్వహణకు ప్రత్యేక పాలసీ

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాల పరిరక్షణ, నిర్వహణ కోసం ‘స్మారక చిహ్న మాన్యుమెంట్‌ పాలసీ’ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2024-29 పర్యాటక పాలసీ కింద పీపీపీ భాగస్వామ్యంతో ఎంపిక చేసే సంస్థలకు వీటి నిర్వహణను అప్పగిస్తారు. పర్యాటక, పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి అజయ్‌ జైన్‌ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిక చేసిన సంస్థకు ఐదేళ్ల కాలపరిమితితో వారసత్వ కట్టాలు, ప్రదేశాల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తూప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. పర్యవేక్షణ కోసం సాధికార కమిటీతోపాటు ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ పాలసీని అమలు చేసే బాధ్యతను పురావస్తు శాఖ డైరెక్టర్‌తోపాటు పర్యాటక శాఖ సీఈవోలకు అప్పగించారు.

Updated Date - Apr 21 , 2026 | 04:42 AM