రేపట్నుంచి ఆన్‌లైన్‌లో ‘నర్సింగ్’ రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Mar 15 , 2026 | 05:02 AM
నర్సింగ్ విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆరోగ్య శాఖ కీలక మార్పులు చేసింది. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ప్రైమరీ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై విజయవాడ...
అమరావతి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): నర్సింగ్ విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆరోగ్య శాఖ కీలక మార్పులు చేసింది. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ప్రైమరీ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై విజయవాడ రావాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని సోమవారం(16వ తేదీ) నుంచి తీసుకురాబోతుంది. ఎన్‌ఆర్టీఎస్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తులను నర్సింగ్ కౌన్సిల్‌లో సంబంధిత ఉద్యోగులు పరిశీలించి ఆన్‌లైన్‌లోనే ఆమోదిస్తారు. కాగా ఉత్తమ నర్సుల అవార్డుల ఎంపిక కోసం ఏపీ నర్సింగ్ కౌన్సిల్ అర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మే 12న జరిగే అంతర్జాతీయ నర్సుల దినోత్సవ కార్యక్రమంలో ఐదుగురికి ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు, ఆస్పత్రుల్లో పని చేస్తున్న నర్సులు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని కౌన్సిల్ రిజిస్ట్రార్ సుశీల తెలిపారు.