టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కృషి
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:50 AM
రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖ అధ్వర్యంలో ప్రైవేటు భాగస్వామ్యంతో కారవాన్‌లను ప్రారంభించి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు భక్తులకు..
రాష్ట్రంలో తొలి టెంపుల్ టూర్ కారవాన్‌ను ప్రారంభించిన మంత్రి ఆనం
నెల్లూరు (సాంస్కృతికం), జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖ అధ్వర్యంలో ప్రైవేటు భాగస్వామ్యంతో కారవాన్‌లను ప్రారంభించి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు భక్తులకు వెసులుబాటు కల్పించనున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూపొందించిన కారవాన్‌ను సోమవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.