Share News

ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభం

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:11 AM

అమరావతిని క్వాంటం టెక్నాలజీకి ఒక దిక్సూచిగా ముందుకు తీసుకెళ్తున్నామని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీసీ) చైర్మన్‌ మన్నవ మోహన్‌ కృష్ణ అన్నారు.

ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభం

అమరావతి, గన్నవరం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): అమరావతిని క్వాంటం టెక్నాలజీకి ఒక దిక్సూచిగా ముందుకు తీసుకెళ్తున్నామని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీసీ) చైర్మన్‌ మన్నవ మోహన్‌ కృష్ణ అన్నారు. మేధా టవర్స్‌లో క్వాంటం ఇంక్యూబేటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్‌ కృష్ణ మాట్లాడుతూ... రాష్ర్టాన్ని క్వాంటం హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో తొలి ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ (ఏక్యూవీ), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, చండీగఢ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా క్వాంటం ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీనికోసం చండీగఢ్‌ యూనివర్సిటీతో కీలక ఒప్పందం చేసుకున్నామన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. క్వాంటం టెక్నాలజీ పరిశోధన స్టార్ట్‌పల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ ఇంక్యుబేషన్‌ కార్యక్రమాల్లో పరస్పర సహకారం ఉంటుందని మోహన కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రతన్‌ టాటా ఇన్నోవేఫన్‌ హబ్‌ సీఈవో ధాత్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 04:12 AM