5 వేల కోట్లతో68 ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులు
ABN , Publish Date - May 13 , 2026 | 04:42 AM
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.
వీటితో అదనంగా 1,822 సీకేఎం నెట్‌వర్క్
విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతానికి చర్యలు
రాష్ట్రంలో 3 జీడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్
21,838 కోట్లతో ఫేజ్-3 గ్రీన్ ఎనర్జీ కారిడార్
విద్యుత్తుశాఖ సమీక్షలో కె.విజయానంద్ వెల్లడి
అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలను కోసం సుమారు రూ. 5 వేల కోట్ల అంచనాతో రాష్ట్రవ్యాప్తంగా 68 ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులను చేపట్టామన్నారు. మంగళవారం విద్యుత్తు సౌధలో ట్రాన్స్‌కో అధికారులతో విజయానంద్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 68 ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులు పూర్తయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు అదనంగా 15,274 మెగావోల్ట్- యాంపియర్(ఎంవీఏ) సామర్థ్యం కల 1,822 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేఎం) ట్రాన్స్‌మిషన్ లైన్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 30 గిగావాట్ హవర్ (జీడబ్ల్యూహెచ్) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్(బీఈఎ్‌సఎస్) అభివృద్ధికి పవర్ సిస్టమ్ డెవల్‌పమెంట్ ఫండ్ (పీఎ్‌సడీఎఫ్) కింద కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మంజూరు చేసిందన్నారు. ఇందులో 3 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యాన్ని ఏపీకి కేటాయించినట్లు తెలిపారు. ఏపీలో 11 గిగావాట్ల సామర్థ్యం కల సౌర విద్యుత్తు ప్రాజెక్టులు, 7370 మెగావాట్ల సామర్థ్యం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును తరలించేందుకు రూ.21,838 కోట్ల అంచనా వ్యయంతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 పథకానికి కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు.