Share News

ఐదు శాఖల్లో 8,341 పోస్టులు

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:00 AM

ప్రభుత్వం 10 వేల పోస్టులతో విడుదల చేయనున్న జాబ్‌ క్యాలెండర్‌లో ఎక్కువ పోస్టులు 5 శాఖల్లోనే ఉన్నాయి. వీటిలోనూ ఉన్నత విద్యాశాఖలోనే అత్యధిక పోస్టులు ఉన్నాయని తెలిసింది.

ఐదు శాఖల్లో 8,341 పోస్టులు

  • విద్యాశాఖలో అత్యధికంగా 4,504

  • హోంశాఖలో 3057, ఎక్సైజ్‌లో 452

  • నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం 10 వేల పోస్టులతో విడుదల చేయనున్న జాబ్‌ క్యాలెండర్‌లో ఎక్కువ పోస్టులు 5 శాఖల్లోనే ఉన్నాయి. వీటిలోనూ ఉన్నత విద్యాశాఖలోనే అత్యధిక పోస్టులు ఉన్నాయని తెలిసింది. దీనిపరిధిలోని యూనివర్సిటీల్లో అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 1,500, పాఠశాల విద్యాశాఖ పరిధిలో డీఎస్సీ, ఇతర పోస్టులు 3,004 ఉన్నాయి. హోంశాఖలో ఖాళీగా ఉన్న 3,057 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో 429 సాయుధ రిజర్వ్‌ పోలీసు కానిస్టేబుల్‌, 490 కానిస్టేబుల్‌, 258 ఫైర్‌మెన్‌, విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో మరో 150 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 328, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఖాళీలు 100 ఉన్నాయి. ఎక్సైజ్‌ శాఖలో 400 కానిస్టేబుల్‌, 25 ఎస్‌ఐ, 27 అసిస్టెంట్‌ కెమికల్‌ ఎగ్జామినర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ 5 శాఖల్లోనే 8,341 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా, గురువారం మంత్రి లోకేశ్‌ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించనున్నారు. ఏపీపీఎస్సీ, పాఠశాల విద్యాశాఖ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 06:00 AM