పలువురు డీఎల్‌డీవోల బదిలీలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:57 AM
రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఎల్‌డీఓలు, జడ్పీ సీఈఓలకు పోస్టింగ్‌లు ఇస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం ఆదేశాలిచ్చింది. నెల్లూరు డ్వామా అడిషనల్ పీడీ ఐ.స్వరూ్‌పను నెల్లూరు డీడీఓగా నియమించారు.
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఎల్‌డీఓలు, జడ్పీ సీఈఓలకు పోస్టింగ్‌లు ఇస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం ఆదేశాలిచ్చింది. నెల్లూరు డ్వామా అడిషనల్ పీడీ ఐ.స్వరూ్‌పను నెల్లూరు డీడీఓగా నియమించారు. శ్రీకాకుళం డ్వామా కార్యాలయ ఫైనాన్స్ మేనేజర్ స్వరూపరాణిని శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారిగా, విశాఖపట్నం డ్వామా ఫైనాన్స్ మేనేజర్ ఎస్.రవీంద్రను పార్వతీపురం మన్యం జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా బదిలీ చేశారు. అనకాపల్లి డ్వామా విజిలెన్స్ అధికారిగా ఉన్న శ్రీలలితను తూర్పుగోదావరి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగాను, రాజమహేంద్రవరం డ్వామా ఏపీఓ కె.కిశోర్‌కుమార్‌ను శ్రీకాకుళం జిల్లా స్వర్ణగ్రామ, స్వర్ణవార్డ్ అధికారిగాను, తిరుపతి డ్వామా ఏపీడీగా ఉన్న టి.చిన్న రెడ్డప్పను సూళ్లూరుపేట డీడీఓగాను, కాకినాడ డ్వామా ఏపీఓ వి.అబ్రహం లింకన్‌ను అంబేద్కర్ కోనసీమ జిల్లా డీడీఓగాను, కాకినాడ డ్వామా ఫైనాన్స్ మేనేజర్ పి.విజయభాస్కర్‌ను అమలాపురం డీడీఓగాను, ఏలూరు జిల్లా చింతలపూడి ఏపీడీ కె.పురుషోత్తంరావును కొవ్వూరు డీడీఓగాను, మదనపల్లి డ్వామా ఏపీడీ ఎన్.శ్రీనివాసులను మదనపల్లి డీడీఓగా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న సీఈఓ జె.వేణుగోపాల్‌ను కాకినాడ జిల్లా స్వర్ణగ్రామ, స్వర్ణవార్డ్ అధికారిగాను, ఆర్.రామలింగేశ్వరరెడ్డిని గుంటూరు జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డ్ అధికారిగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు.