వైద్య సేవల్లో ఏఐ
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:47 AM
రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అందించే సేవల్లో ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధ (ఏఐ)ను ప్రవేశపెట్టి పరీక్షించారు. స్టార్టప్ ...
18 స్టార్ట్‌పలను పరీక్షించిన ఆరోగ్య శాఖ
సత్ఫలితాలు వచ్చాయన్న మంత్రి సత్యకుమార్
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అందించే సేవల్లో ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధ (ఏఐ)ను ప్రవేశపెట్టి పరీక్షించారు. స్టార్టప్ కంపెనీల ద్వారా అందించిన ఆ ఏఐ సేవల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టార్ట్‌పలకు 4 కేటగిరిల్లో మొత్తం రూ. 40 లక్షలు ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఓ స్టార్ట్‌పకు రూ. కోటి విలువ చేసే వర్క్ ఆర్డర్ కూడా ఇస్తారు. ఈ పరీక్ష కోసం ఆరోగ్యశాఖ ఏపీ మెడ్ టెక్ ఇన్నోవేషన్ చాలెంజ్ ప్రకటనకు 297 స్టార్ట్‌పల నుంచి దరఖాస్తులు రాగా మూడు అంచెల పరిశీలన అనంతరం 18 సంస్థలను ఎంపిక చేశారు. కేటగిరీల వారీగా ఈ స్టార్ట్‌పలు ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు అందించాయి. దేశంలోనే తొలిసారిగా ఏపీలో స్టార్ట్‌పల ద్వారా వైద్య సేవలను రోగులకు అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. వీటి పనితీరు, ఫలితాలను త్వరలో అమరావతిలో జరిగే సదస్సు ద్వారా ఆరోగ్యశాఖ ప్రతి డిపార్టుమెంటుకు, జాతీయ సంస్థలకు వివరించాలని నిర్ణయించామన్నారు.