Share News

గొడ్డలి పాలనలో అప్పులతో చితికిపోయిన రాష్ట్రం: పీతల సుజాత

ABN , Publish Date - May 12 , 2026 | 04:49 AM

గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రం అప్పులతో చితికిపోయిందని, 5 ఏళ్ల పాలనలో సుమారు రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత గొడ్డలి పార్టీకి దక్కుతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత అన్నారు.

గొడ్డలి పాలనలో అప్పులతో చితికిపోయిన రాష్ట్రం: పీతల సుజాత

అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రం అప్పులతో చితికిపోయిందని, 5 ఏళ్ల పాలనలో సుమారు రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత గొడ్డలి పార్టీకి దక్కుతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘విధ్వంసమైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం 23 నెలల్లోనే గాడిన పెట్టింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేస్తున్నారు. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు పరిశ్రమల స్థాపనతో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో చంద్రబాబు నడిపిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Updated Date - May 12 , 2026 | 04:49 AM