Share News

రెండేళ్లలో 4.5 లక్షల ఇళ్లు నిర్మించాం

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:00 AM

గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేశామని గృ హ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

రెండేళ్లలో 4.5 లక్షల ఇళ్లు నిర్మించాం

  • వివిధ దశల్లో మరో 4 లక్షల గృహాలు

  • ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

  • గత వైసీపీ సర్కార్‌ కక్ష సాధింపు వల్ల లక్షల మంది పేదలకు నష్టం జరిగింది

  • గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి

అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేశామని గృ హ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మరో 4 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి నిర్మాణాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యం తో ప్రభుత్వం ఉందని, గృహ నిర్మాణ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి పార్థసారథి గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయడంతోపాటు కొత్తగా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. కొత్తగా పీఎంఏవై 2.0 కింద రాష్ట్రానికి ఇప్పటి వరకు 87 వేల ఇళ్లు మంజూరు కాగా, వాటిలో ఇప్పటికే 12 వేల గృహాల వరకు పూర్తయినట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి యూనిట్‌ వ్యయం రూ.2.5 లక్షలుగా కొనసాగిస్తూనే.. లబ్ధిదారులకు అదనంగా రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రుణాలపై వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

వైసీపీ వచ్చీరాగానే బిల్లులు ఆపేసింది..

వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో అంతకుముందు టీడీపీ ప్రభుత్వం అమ లు చేసిన ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసి ంగ్‌ పథకాన్ని నిలిపివేసి, లక్షలాది మంది పేదలకు అన్యాయం చేసిందని మంత్రి విమర్శించారు. ‘2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పీఎంఈవై ప్రోగ్రాం ప్రారంభం కాకముందే.. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకుండానే ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. 5,63,179 ఇళ్ల నిర్మాణాన్ని గ్రౌండింగ్‌ చేసింది. వాటిలో 2.73 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ స్కీం లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వకుండా నిలిపివేసింది.’ అని వివరించారు.


ఇళ్లపై సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి మొత్తం 15.54 లక్షల ఇళ్లను మం జూరు చేయగా.. కేవలం 6,70,636 ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగారని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని, ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారని తెలిపారు.

లే-అవుట్లలో ఖాళీ స్థలాల వినియోగంపై సమీక్ష

వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన లే-అవుట్లలో సెంటు చొప్పున దాదాపు 20 లక్షల ఇంటి స్థలాలను పేద కుటుంబాలకు పంపిణీ చేసినప్పటికీ, వాటిలో 6 లక్షల స్థలాల్లో మాత్రమే గృహ నిర్మాణాలు చేపట్టారని, మిగిలినవి ఖాళీగానే ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఆ ఖాళీ స్థలాలను కలిపేసి, లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉండేలా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ విషయమై రెవెన్యూతోపాటు సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులతో చర్చించి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jun 19 , 2026 | 05:01 AM