అహ్మద్‌బాబుపై ఉద్యోగుల సంఘం వ్యాజ్యం
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:27 AM
ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారం టూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రమేశ్‌కుమార్ వేసిన పిటిషన్‌పై సోమవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.
సోమవారం తగిన ఉత్తర్వులు ఇస్తామన్న హైకోర్టు
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారం టూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రమేశ్‌కుమార్ వేసిన పిటిషన్‌పై సోమవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్న చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్(సీసీఎస్‌టీ) అహ్మద్‌బాబుపై చర్యలు తీసుకొనేలా కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ రమేశ్‌కుమార్ హైకోర్టులో పిటిష న్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగుల పట్ల చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ (సీసీఎస్‌టీ) అహ్మద్‌బాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణకు రాగా అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వినతిని సీఎస్ పరిశీలిస్తున్నారని చెప్పారు. అహ్మద్‌బాబుపై విచారణ జరపాలని ఆదేశించాలంటే ఆయన వాదన కూడా వినాల్సి ఉం టుందన్నారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేవిధంగా, అవసరమైతే ఐఏఎస్ అధికారిపై విచారణ జరిపేలా సీఎ్‌సను ఆదేశించాలని కోరారు.