Share News

అంబటి వ్యాజ్యాల్లో వివరాలు ఇవ్వండి: హైకోర్టు

ABN , Publish Date - Apr 17 , 2026 | 05:58 AM

తన అక్రమ నిర్బంధం, కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసిన వ్యవహారంపై సీఐడీ, సిట్‌తో కాకుండా స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత అంబటి రాంబాబు..

అంబటి వ్యాజ్యాల్లో వివరాలు ఇవ్వండి: హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): తన అక్రమ నిర్బంధం, కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసిన వ్యవహారంపై సీఐడీ, సిట్‌తో కాకుండా స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత అంబటి రాంబాబు వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తన ఇంటిపై దాడికి సంబంధించి పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించాలని అంబటి రాంబాబు వేసిన మరో పిటిషన్‌లో కూడా వివరాలు సమర్పించాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Apr 17 , 2026 | 05:59 AM