‘ఆకివీడు’ పిల్‌పై జోక్యానికి హైకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:19 AM
పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు గ్రామ పంచాయతీ, పెదపేటలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రామాలయాన్ని నిలువరించాలంటూ దాఖలైన...
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు గ్రామ పంచాయతీ, పెదపేటలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రామాలయాన్ని నిలువరించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా రామాలయాన్ని నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ పెదపేటకు చెందిన ఉన్నమట్ట జయంతి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. శ్రీరామ ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవి ప్రసాద్ వాదనలు వినిపించారు.