Share News

హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ప్రభునాథ్‌

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:37 AM

ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా వాసిరెడ్డి ప్రభునాథ్‌ గెలుపొందారు. ఆయనకు మొత్తం 832 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడి బరిలో ఉన్న సమీప అభ్యర్థి జీవీఎస్‌ కిశోర్‌ కుమార్‌కు...

హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ప్రభునాథ్‌

  • ఉపాధ్యక్షుడిగా పీటా రామన్‌

  • ప్రధాన కార్యదర్శిగా తిరుమలశెట్టి కిరణ్‌ ఎన్నిక

  • విజేతల్లో ప్రభునాథ్‌ ప్యానల్‌లోని వారే అధికం

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా వాసిరెడ్డి ప్రభునాథ్‌ గెలుపొందారు. ఆయనకు మొత్తం 832 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడి బరిలో ఉన్న సమీప అభ్యర్థి జీవీఎస్‌ కిశోర్‌ కుమార్‌కు 807 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన న్యాయవిభాగాలు, అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ (ఐఏఎల్‌) బలపర్చిన ప్రభునాథ్‌, వైసీపీ మద్దతుతో పోటీ చేసిన జీవీఎస్‌ కిశోర్‌ కుమార్‌పై 25 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా పీటా రామన్‌ విజయం సాధించారు. రామన్‌కు 712 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి ఎస్‌.హరినాథ్‌రెడ్డికి 593 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా తిరుమలశెట్టి కిరణ్‌ గెలుపొందారు. కిరణ్‌కు 1217 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి మంచల సాల్మన్‌ రాజుకు 634 ఓట్లు వచ్చాయి. సంయుక్త కార్యదర్శిగా వల్లభనేని శాంతిశ్రీ గెలుపొందారు. గ్రంథాలయ కార్యదర్శిగా ఆకుమర్తి పుష్పలీల, కోశాధికారిగా ఎంఎ్‌సవీఎస్‌ సుధారాణి గెలిచారు. క్రీడలు, సంస్కృతిక కార్యదర్శిగా యడ్లూరి రత్నం గెలుపొందారు. మహిళా ప్రతినిధిగా కె.అనూరాధ గెలిచారు, కార్యనిర్వహణ సభ్యులు (30 సంవత్సరాలు)గా సంభాన శశికళ, కార్యనిర్వహణ సభ్యులు(ఇరవై సంవత్సరాలు)గా గంగిశెట్టి రాజేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ మహిళా సభ్యులు(పది సంవత్సరాలు)గా పుప్పాల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులు జనరల్‌(ఉమెన్‌)గా బొట్టా అరుణ గెలిచారు. ఈసీ సభ్యులుగా 14 మంది బరిలో ఉండగా అందులో దేవ దీపక్‌ అనిరుఽధ్‌ యాదవ్‌, వైవీకే చక్రవర్తి, రుద్ర మల్లికార్జునరావు ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు జరిగిన ఈ ఎన్నికలకు.. ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్‌ న్యాయవాది ఎం.విజయ్‌కుమార్‌ వ్యవహరించారు. ఈ సందర్భంగా.. తన విజయానికి కృషి చేసిన న్యాయవాదులు, టీడీపీ, జనసేన న్యాయ విభాగం, ఐలు, ఐఏఎల్‌, స్వేచ్ఛ సంస్థకు చెందిన న్యాయవాదులకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వాసిరెడ్డి ప్రభునాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 11 , 2026 | 03:37 AM