Share News

వడ్డెర సొసైటీలకు మైనింగ్‌కు భూములు

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:28 AM

గుర్తింపు పొందిన వడ్డెర సొసైటీలకు కొండలు, గుట్టలను రిజర్వుచేసి, సీనరేజీ ఫీజులో 50 శాతం మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం, దాని అమలుకు తాజాగా విధివిధానాలు తీసుకొచ్చింది.

వడ్డెర సొసైటీలకు మైనింగ్‌కు భూములు

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): గుర్తింపు పొందిన వడ్డెర సొసైటీలకు కొండలు, గుట్టలను రిజర్వుచేసి, సీనరేజీ ఫీజులో 50 శాతం మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం, దాని అమలుకు తాజాగా విధివిధానాలు తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ మైనర్‌ మినరల్స్‌ కన్సెషన్‌ (ఏపీఎంఎంసీ) రూల్స్‌-1966లో 4,10,12(5)(ఏ)లో సవరణలు తీసుకొస్తూ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్‌ మీనా మంగళవారం ఉత్తర్వులు (జీఓ126) జారీ చేశారు. సవరించిన నిబంధనల ప్రకారం ప్రతీ జిల్లా పరిధిలో వడ్డెర సొసైటీలకు మైనింగ్‌ కోసం సగటున 100 హెక్టార్లు (247.105 ఎకరాలు) కేటాయిస్తారు. వడ్డెర సామాజికవర్గం వారు సొసైటీలను ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటేనే భూములు ఇస్తారు. ప్రతీ జిల్లా పరిధిలో వడ్డెర క్వారీ పూల్‌ కింద ఈ భూమిని సమకూర్చేలా రూల్‌4లో సవరణ తీసుకొచ్చారు. రూల్‌ 10ని సవరించి మైనరల్‌ మినరల్స్‌లో రాతి గుట్టలు, కొండల మైనింగ్‌ ఏరియాలను పార్ట్‌ సి(2) కిందకు తీసుకొచ్చారు. మైనింగ్‌ కోసం దరఖాస్తు చేసుకునే సొసైటీలకు రూల్స్‌ 10లోని పార్ట్‌ సీ (2)లో పేర్కొన్న మైన్స్‌కు అనుమతి ఇవ్వాలి. జిల్లా పరిధిలో ఎక్కువగా సొసైటీలు టే, సగటున ఒక్కో దానికి 13 హెక్టార్ల భూమి కేటాయిస్తారు. పరిమితిలో ఉంటే, క్వారీపూల్‌ను కేటాయించనున్నారు.

Updated Date - Jun 24 , 2026 | 05:29 AM