Share News

ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 06:16 AM

రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తూ, భూములు కేటాయిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు

  • పెట్టుబడులతో వచ్చిన పలు కంపెనీలకు భూములు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తూ, భూములు కేటాయిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కంపెనీలు, ప్రోత్సాహకాల ఉత్తర్వులు ఇలా ఉన్నాయి..

  • తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ. 740 కోట్ల పెట్టుబడితో 1049 ఉద్యోగాలు కల్పించే జెట్‌ఫ్యాబ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నాయుడుపేట సెజ్‌లో 75 శాతం రాయితీతో 35 ఎకరాలను కేటాయించారు. జెట్‌ఫ్యాబ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మల్టీ లేయర్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డును తయారు చేస్తుంది.

  • క్వాంటమ్‌ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌, క్రయోజెనిక్‌ హెచ్‌ఈంటీ డెవల్‌పమెంట్‌, క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ ఫెసిలిటీని రూ. 60 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపానదనలు ఇచ్చిన మెస్సర్స్‌ సాస్‌ క్వాంటమ్‌కు అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో 70 శాతం డిస్కౌంట్‌తో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లో 3,000 చదరపు అడుగుల ఆఫీసు స్థలం కేటాయింపు.

  • రూ. 1,084.11 కోట్ల పెట్టుబడి, 1,600 మందికి ఉద్యోగాల కల్పనతో ఎయిర్‌ కండీషనర్ల తయారీ యూనిట్‌ను స్థాపించే ఈప్యాక్‌ డ్యూరబుల్‌ సంస్థకు మెనకూరు నాయు డుపేట సెజ్‌లో 36.41 ఎకరాలను ఒక్కో ఎకరా రూ. 60 లక్షల చొప్పున కేటాయించారు.


  • రూ. 347 కోట్ల పెట్టుబడితో 1,633 మం దికి ఉద్యోగాలు కల్పించే మెక్‌నెక్స్‌ ఇండి యా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు తిరుపతి శ్రీసిటీ సెజ్‌లో ఆటోమోటివ్‌ కెమెరా మాడ్యూల్స్‌ ఉత్పత్తి సంస్థను నెలకొల్పేందుకు ప్రభు త్వం ఆమోదం తెలిపింది. ఈ సంస్థకు భారీ ఎలకా్ట్రనిక్స్‌ సంస్థకు ఇచ్చే ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చర్య లు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

  • రూ. 170 కోట్ల పెట్టుబడితో 4,000 మం దికి ఉద్యోగాలను కల్పించే ఇన్‌ఫినిక్స్‌ టె క్నాలజీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడ ఐటీ పార్కులో 5.08 ఎకరాలను కేటాయించారు.

  • అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో ఫ్రూగల్‌ ఏఐ, కేంబ్రిడ్జ్‌, జడ్జి బిజినెస్‌ స్కూల్‌ స్థాపనకు 2.6 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.

  • అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో మెసర్స్‌ క్వాంటమ్‌ బయోసైన్సెస్‌ ప్రైవే ట్‌ లిమిటెడ్‌ పరిశోధన అభివృద్ధి సెంటర్‌ను రూ. 222.5 కోట్లతో ఏర్పా టు చేసేందుకు ఐటీ శాఖ ఆమోదించింది. ఆ పరిశోధనా కేంద్రం లో ఎక్యూట్‌ కిడ్నీ ఇన్‌జ్యురీ (ఏకేఐ) ఎనేబ్లింగ్‌ ప్రొీస్రజర్స్‌, ఏఐ డయాగ్నోసిస్‌ క్లినికల్‌ ఇన్‌సైట్స్‌ను గుర్తిస్తుంది. ఈ సంస్థకు 75 శాతం డిస్కౌంట్‌తో రెండు ఎకరాలను అమరావతి వ్యాలీలో భూమిని కేటాయించారు.

  • సిఫీ ఇన్ఫినిట్‌ స్పేసెస్‌ లిమిటెడ్‌ 500 మెగావాట్ల డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు విశాఖపట్నం పరదేశీపాలెంలో 25 ఎకరాలను కేటాయించారు.

Updated Date - Jun 30 , 2026 | 06:16 AM