Share News

37 కరువు మండలాల్లో 50 రోజులు అదనపు ఉపాధి

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:27 AM

రాష్ట్రంలోని 37 కరువు మండలాల్లో అదనపు ఉపాధి పనిదినాలు కల్పిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది.

37 కరువు మండలాల్లో 50 రోజులు అదనపు ఉపాధి

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 37 కరువు మండలాల్లో అదనపు ఉపాధి పనిదినాలు కల్పిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం శ్రీసత్యసాయి జిల్లాలో 25 మండలాలు, అన్నమయ్య జిల్లాలో 9, ప్రకాశం జిల్లాలో మూడింటిని ఇప్పటికే కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ మండలాలకు మరో 50 పనిదినాలు అదనంగా కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం ఆమోదించడంతో ఈ 37 మండలాల్లో ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాలు కల్పిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది. మార్చి 31లోపు ఈ పనిదినాలు వాడుకోవలసి ఉంటుంది.

Updated Date - Mar 02 , 2026 | 04:28 AM