Share News

3,168 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌!

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:07 AM

రాష్ట్రంలో రెండో విడత జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ఆగస్టు 15న రెండో విడత జాబ్‌ క్యాలెండర్‌కు..

3,168 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌!

  • రెండో విడత ప్రకటనకు సన్నద్ధం

  • ఆగస్టు 15న నోటిఫికేషన్లు.. సీఎస్‌ సమీక్ష

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో విడత జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ఆగస్టు 15న రెండో విడత జాబ్‌ క్యాలెండర్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. తొలుత 3,797 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను జారీ చేయాలని భావించినా తాజాగా 3,168కు పరిమితమైనట్టు తెలిసింది. వీటిలో 91 గ్రూప్‌-1 పోస్టులు ఉన్నాయి. కాగా, సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌ ఈ అంశంపై కార్యదర్శులు, హెచ్‌వోడీలతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

Updated Date - Jul 14 , 2026 | 04:08 AM