గనులపై సీఎస్ నేతృత్వంలో కమిటీ
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:33 AM
రాష్ట్రంలో కొత్త గనుల అన్వేషణ, కొత్తగా ఖనిజాల తవ్వకం లీజుల వేలం తదితర అంశాల పర్యవేక్షణ, సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త గనుల అన్వేషణ, కొత్తగా ఖనిజాల తవ్వకం లీజుల వేలం తదితర అంశాల పర్యవేక్షణ, సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలో ఒక కమిటీ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గనుల వేలం ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని రకాల అనుమతులు సాధించేందుకు ఈ కమిటీ పనిచేయనుంద ని సీఎస్ కె.విజయానంద్ సోమవారంవిడుదల చేసిన ఉత్తర్వు(జీఓ21)ల్లో పేర్కొన్నారు. కమిటీలో అటవీ, పర్యావరణ, రెవెన్యూ, గనులశాఖల ముఖ్యకార్యద ర్శులు, కాలుష్యనియంత్రణ మండలి అధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీకి సభ్య కన్వీనర్‌గా గనుల శాఖ డైరెక్టర్ ఉంటారు. ప్రతినెలా కమిటీ సమావేశమై లీజుల వేలం ప్రక్రియలోని అంశాలపై చర్చించనుంది.