రూ.49.748 కోట్లతో దగదర్తి విమానాశ్రయానికి కనెక్టివిటీ పనులు
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:42 AM
బ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న దగదర్తి విమానాశ్రయానికి సాంకేతిక, ఆర్థిక సన్నద్ధత నివేదిక(టీఈఎఫ్ఆర్)ను మెసర్స్ రైట్స్ ఇచ్చిన నేపథ్యంలో...
ఉత్తర్వు జారీ చేసిన మౌలిక సదుపాయాల కల్పనా శాఖ
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న దగదర్తి విమానాశ్రయానికి సాంకేతిక, ఆర్థిక సన్నద్ధత నివేదిక(టీఈఎఫ్ఆర్)ను మెసర్స్ రైట్స్ ఇచ్చిన నేపథ్యంలో రూ.49.748 కోట్లతో ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు సోమవారం మౌలిక సదుపాయల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కనెక్టివిటీ కోసం అవసరమైన భూసేరణ పనులు చేపట్టామని నెల్లూరు కలెక్టరు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో తక్షణమే కనెక్టివిటీ పనులు ప్రారంభించాలని ఎంటీ కృష్ణబాబు ఆదేశించారు.