Share News

తోతాపురి కిలోకు రూ.4 ప్రోత్సాహం

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:20 AM

రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

తోతాపురి కిలోకు రూ.4 ప్రోత్సాహం

  • సీఎం ఆదేశాలు.. మంత్రి అచ్చెన్న, గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడి

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా, పొగాకు, తోతాపురి మామిడి రైతుల కష్టాన్ని సీఎం అర్ధం చేసుకుని, వారికి ఊరటిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఆక్వా దాణా ధర కిలోకి రూ.4 తగ్గింపుతోపాటు, తోతాపురి మామిడి కిలోకి రూ.4 ప్రోత్సాహం, వర్జీనియా పొగాకు కిలో రూ.200కు తగ్గకుండా కొనాలని చెప్పి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారన్నారు. గురువారం రాత్రి ఉండవల్లిలోని క్యాంప్‌ ఆఫీ్‌సలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, పలువురు ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, రవికుమార్‌ మీడియాతో మాట్లాడారు. ధర లేక నష్టపోతున్న తోతాపురి మామిడి రైతులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ఏడాది కూడా కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహం అందించాలని సీఎం నిర్ణయించారన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 05:20 AM