Share News

16న విజయవాడలో ప్రభుత్వ ‘ఇఫ్తార్‌’

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:25 AM

పవిత్ర రంజాన్‌ మాసంలో రాష్ట్రస్థాయిలోనూ, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇఫ్తార్‌ విందులు ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది....

16న విజయవాడలో ప్రభుత్వ ‘ఇఫ్తార్‌’

  • అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహణ.. 1.5 కోట్లు విడుదల

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్‌ మాసంలో రాష్ట్రస్థాయిలోనూ, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇఫ్తార్‌ విందులు ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్‌ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌ లో నిర్వహిస్తారు. జిల్లా స్థాయి ఇఫ్తార్‌ కార్యక్రమాలను రానున్న 4, 5 రోజుల్లో కలెక్టర్లు తమకు అనువైన రోజున నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. విజయవాడలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఇఫ్తార్‌ నిర్వహించనున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

Updated Date - Mar 12 , 2026 | 03:25 AM