Share News

వీఓఏలకు ప్రోత్సాహక బకాయిలు విడుదల

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:41 AM

రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు సహకారమందిస్తున్న విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌(వీఓఏ)లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీఓఏలకు రూ.22.67 కోట్ల ప్రోత్సాహక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని..

వీఓఏలకు ప్రోత్సాహక బకాయిలు విడుదల

  • రూ.22.67 కోట్లు మంజూరుచేస్తూ ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు సహకారమందిస్తున్న విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌(వీఓఏ)లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీఓఏలకు రూ.22.67 కోట్ల ప్రోత్సాహక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సెర్ప్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,336 మంది వీఓఏలకు లబ్ధి చేకూరనుంది. ఒక సంవత్సరానికి రూ.22.67 కోట్లను ప్రోత్సాహంగా విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 27,336 గ్రామ సంఘాల్లో పనిచేసే వీఓఏలకు ఈ నిధులు ఇస్తారు. ఇప్పటికే స్త్రీనిధి ద్వారా గ్రామ సంఘాలకు 0.25 శాతం ప్రోత్సాహకాలు ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల నుంచి వసూలైన వడ్డీ ఆధారంగా 0.75 శాతం ప్రోత్సాహకాన్ని వీఓఏలకు ఇవ్వాలని నిర్ణయించారు.

Updated Date - Apr 23 , 2026 | 03:41 AM