Share News

మరో రూ.1,000 కోట్ల అప్పు

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:32 AM

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కొత్తగా మరో రూ.1,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఆర్‌బీఐలో ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు తెచ్చారు.

మరో రూ.1,000 కోట్ల అప్పు

అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కొత్తగా మరో రూ.1,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఆర్‌బీఐలో ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు తెచ్చారు. ఈ అప్పు చెల్లింపు కాలపరిమితి 13 ఏళ్లు. 7.56 శాతం వడ్డీ రేటు పడింది. ఏప్రిల్‌ 8వ తేదీన 8.07 శాతం వడ్డీతో తీసుకున్న రూ.1,600 కోట్ల అప్పుల బాండ్లను వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఉద్దేశంతో మంగళవారం తిరిగి ఇష్యూ చేయగా.. వీటిపై వడ్డీ 7.66 శాతం పడింది.

Updated Date - Jul 01 , 2026 | 05:33 AM