విద్యుత్తు గ్రిడ్ బలోపేతానికి 9319.30 కోట్లు
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:47 AM
రా ష్ట్రంలో విద్యుత్తు గ్రిడ్ ను బలోపేతం చేసి భ విష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా గ్రిడ్ ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఏపీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో సుమారు రూ.9319.30 కోట్ల...
55 ప్రాజెక్టుల ద్వారా గ్రిడ్‌కు 8,853 ఎంవీఏ అదనపు సామర్థ్యం
గణతంత్ర వేడుకల్లో ట్రాన్స్‌కో జేఎండీ ప్రవీణ్ చంద్
అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రా ష్ట్రంలో విద్యుత్తు గ్రిడ్ ను బలోపేతం చేసి భ విష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా గ్రిడ్ ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఏపీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో సుమారు రూ.9319.30 కోట్ల అంచనా వ్యయంతో 55 ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు చేపడుతున్నామని ట్రా న్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. సోమవారం విజయవాడలోని వి ద్యుత్తు సౌధలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెన్కో ఇన్‌చార్జి ఎండీ పుల్లారెడ్డితో కలసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ‘ఇటీవల 3,240 ఎంవీఏ అదనపు సామర్థ్యాన్ని విస్తరించడంతోపాటు, 950 సర్క్యూట్ కిలోమీటర్ల కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేశాం. కొత్తగా చేపడుతున్న 55 ప్రాజెక్టుల ద్వారా మరో 8,853 ఎంవీఏ సామర్థ్యం జత కలుస్తుంది. 1,558 సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్ లైన్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. గత ఏడాది కాలంగా ట్రాన్స్‌కో చేపట్టిన చర్యల ఫలితంగా విద్యుత్తు పంపిణీ నష్టాలను రికార్డు స్థాయిలో 2.6 శాతానికి తగ్గించగలిగాం. ఏపీలో ప్రస్తుతం మొత్తం 21,153 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఉంది. అందులో పునరుత్పాదక శక్తి 37ు కాగా, 22ు విద్యుత్తు ఉత్పత్తిని అందిస్తుంది. 2024-25లో రాష్ట్రం 13,712 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ను నమోదు చేసింది. రాష్ట్రంలో 6,020 మెగావాట్ల సామర్థ్యం గల 6 పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు రానున్నాయి’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో డైరెక్టర్లు జేవీరావు, ఏకేవీ భాస్కర్, ఎన్‌వీ రమణమూర్తి, జెన్కో డైరెక్టర్లు వి.ఉష, ఎం.సుజయ్‌కుమార్, అశోక్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.