కల్తీ నెయ్యి కారకులపై కఠిన చర్యలు
ABN , Publish Date - May 28 , 2026 | 05:32 AM
టీటీడీలో కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించిన వివిధ శాఖల్లోని అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సిట్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా...
సిట్ నివేదికతో వేగం పెంచిన ప్రభుత్వం ..మరికొన్ని శాఖల అధికారులపైనా వేటు
తిరుపతి టీటీడీ, మే 27(ఆంధ్రజ్యోతి): టీటీడీలో కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించిన వివిధ శాఖల్లోని అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సిట్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పటికే టీటీడీలో పనిచేస్తున్న అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వైష్ణవి డెయిరీకి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. అప్పటి ప్రొక్యూర్‌మెంట్ విభాగంలో పనిచేసిన మార్కెటింగ్, గోడౌన్ సిబ్బంది సైతం అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి చర్యలు చేపడుతున్నారు. టీటీడీతోపాటు ఇతర శాఖల్లో జరిగిన అవినీతిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. రానున్న రోజుల్లో సిట్ నివేదిక ఆఽధారంగా మరికొంతమందిపైనా చర్యలకు సిద్ధమవుతోంది.