Share News

రాష్ట్రంలో ఓడల తయారీ, అభివృద్ధికి ప్రభుత్వ కంపెనీ ఏర్పాటు

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:37 AM

రాష్ట్రంలో ఓడల తయారీ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌ జాతీయ షిప్‌బిల్డింగ్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ పార్క్‌ (ఎన్‌ఎస్‌హెచ్‌ఐపీ-ఏపీ లిమిటెడ్‌) పేరిట ప్రభుత్వం...

రాష్ట్రంలో ఓడల తయారీ,  అభివృద్ధికి ప్రభుత్వ కంపెనీ ఏర్పాటు

  • ఎన్‌ఎస్‌హెచ్‌ఐపీ-ఏపీ లిమిటెడ్‌ ఏర్పాటు

  • దగదర్తిలో స్థాపించాలని నిర్ణయం.. ప్రభుత్వ ఉత్తర్వులు

అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓడల తయారీ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌ జాతీయ షిప్‌బిల్డింగ్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ పార్క్‌ (ఎన్‌ఎస్‌హెచ్‌ఐపీ-ఏపీ లిమిటెడ్‌) పేరిట ప్రభుత్వం ఓ కంపెనీని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ ఓడల నిర్మాణం, మరమ్మతులు, ఇతర నౌకా పరమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. కంపెనీ ఏర్పాటుపై ఏపీ మారిటైమ్‌ బోర్డుతో ఎన్‌ఎ్‌సహెచ్‌ఐపీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీని దగదర్తిలో స్థాపిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. షిప్‌ బిల్డింగ్‌ డెవల్‌పమెంట్‌ స్కీమ్‌ (ఎస్‌బీడీఎస్‌), మారిటైమ్‌ ఇండియా విజన్‌-2030, మారిటైమ్‌ అమృత్‌కాల్‌ విజన్‌ 2047 కింద ఎన్‌ఎ్‌సహెచ్‌ఐపీ-ఏపీ లిమిటెడ్‌ను స్థాపించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఈ కంపెనీ చైర్మన్‌గా విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్‌ వ్యవహరిస్తారు. డైరెక్టర్లుగా మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉంటారు. ఎండీగా ఏపీమారిటైమ్‌ బోర్డు సీఈవో వ్యవహరిస్తారు.

Updated Date - Mar 03 , 2026 | 03:37 AM