Share News

7.80 లక్షల మందికి దోమ తెరల పంపిణీ

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:42 AM

రాష్ట్రంలో మలేరియా జ్వరాల నివారణకు ఉచితంగా దోమ తెరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రూ.19.25 కోట్ల ఖర్చుతో ...

7.80 లక్షల మందికి దోమ తెరల పంపిణీ

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మలేరియా జ్వరాల నివారణకు ఉచితంగా దోమ తెరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రూ.19.25 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని 7.80 లక్షల మందికి 6,89,421 దోమ తెరల్ని ఆరోగ్య శాఖ అధికారులు పంపిణీ చేయనున్నారు. ఇందులో మలేరియా తీవ్రంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63,507, పార్వతీపురం మన్యం జిల్లాలో 26 వేల దోమ తెరల్ని ఇప్పటికే పంపిణీ చేశారు. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రంలోని మిగిలిన 26 జిల్లాల్లో 5.99 లక్షల దోమ తెరల్ని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 340 ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, రెసిడెన్షియ్‌ విద్యా సంస్థల్లో పిల్లలకు 2.55 లక్షల తెరల్ని అందజేయనున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 03:42 AM