Share News

పంచాయతీల పునర్విభజనకు శ్రీకారం

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:17 AM

గ్రామ పంచాయతీ వ్యవస్థలో పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా జనాభా, ఆదాయం, భౌగోళిక ప్రాంతం ఆధారంగా పంచాయతీల పునర్విభజనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పంచాయతీల పునర్విభజనకు శ్రీకారం

అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ వ్యవస్థలో పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా జనాభా, ఆదాయం, భౌగోళిక ప్రాంతం ఆధారంగా పంచాయతీల పునర్విభజనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంతకుముందే నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు అన్నమయ్య, అనంతపురం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లోని పలు పంచాయతీలను గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 కేటగిరీలుగా, రూర్బన్‌ గ్రామ పంచాయతీలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ తగు చర్యలు తీసుకోవాలని, ఆయా జిల్లాల్లో వర్గీకరించిన గ్రామ పంచాయతీల నిధులు సజావుగా వినియోగించేందుకు సీఎ్‌ఫఎంఎస్‌ పోర్టల్‌లోని ఆన్‌లైన్‌ డేటాలో అవసరమైన మార్పులు చేయాలని ఖజానాల డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Mar 10 , 2026 | 04:18 AM