అటవీ, రెవెన్యూ శాఖల భూ వివాదాల పరిష్కారానికి కమిటీ
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:07 AM
అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన పలు అంశాలు..
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన పలు అంశాలు.. ఖనిజ బ్లాకుల నిర్వహణను ఖరారు చేయడంలో జాప్యానికి కారణమౌతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో రెండు శాఖల మధ్య భూ వివాదాలను పరిశీలించి, వివాదాలను పరిష్కరించేందుకు, ప్రభుత్వానికి స్పష్టమైన సిఫారసులు సమర్పించడానికి వీలుగా అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీని నియమించింది. కమిటీ సభ్య కన్వీనర్‌గా పీసీసీఎఫ్/హెచ్‌వోఎఫ్ఎఫ్ సీసీఎల్‌ఏ, సర్వే, ల్యాండ్ రికార్డ్సు, సెటిల్ మెంట్స్ డైరెక్టర్, అదనపు పీసీసీఎఫ్ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్య కన్వీనర్‌గా వ్యవహరించే పీసీసీఎఫ్ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ వివాదాలకు సంబంధించిన కేసులపై నిర్ధిష్ట సమయంలో నివేదికను కమిటీ ముందు ఉంచాలని ప్రభుత్వం నిర్ధేశించింది.