నీరు తెచ్చి... నారుకు పోసి...!
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:33 AM
నారుమళ్లను కాపాడుకునేందుకు బక్కెట్లతో నీళ్లు తెచ్చి పోయడం ఇప్పుడు ఉత్తరాంధ్ర రైతులకూ తప్పడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు ముఖం చాటేశాయి.
సంతకవిటి, జూలై 18(ఆంధ్రజ్యోతి): నారుమళ్లను కాపాడుకునేందుకు బక్కెట్లతో నీళ్లు తెచ్చి పోయడం ఇప్పుడు ఉత్తరాంధ్ర రైతులకూ తప్పడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో చెరువులు, గెడ్డల్లో (వాగులు) నీరులేక నారుమడులు పోసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నారును కాపాడుకోవడానికి డ్రమ్ముల్లో నీటిని తెచ్చి, బకెట్లతో పోస్తున్నారు. ఇందుకోసం ఖర్చు, శ్రమను లెక్కచేయకుండా.. పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్నారు. విజయనగరం జిల్లా సంతకిటి మండలం ముకుందపురం గ్రామంలో శనివారం ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.