ఆప్కాబ్, పర్సన్ ఇన్‌చార్జి కమిటీల గడువు పెంపు
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:56 AM
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీ గడువును ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీ గడువును ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ప్రస్తుతం జూలై 17 వరకు ఉన్న కమిటీ గడువును, జూలై 18 నుంచి వచ్చే ఏడాది జనవరి 17 వరకు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పర్సన్ ఇన్‌చార్జిల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ నెల 27 నుంచి డిసెంబరు 26వరకు ప్రస్తుత పర్సన్ ఇన్‌చార్జిలను కొనసాగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.