Share News

301 బార్లకు రీనోటిఫికేషన్‌

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:51 AM

బార్‌ పాలసీలో మిగిలిపోయిన 301 బార్లకు తిరిగి నోటిఫికేషన్‌ జారీచేసినట్టు ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు...

301 బార్లకు రీనోటిఫికేషన్‌

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): బార్‌ పాలసీలో మిగిలిపోయిన 301 బార్లకు తిరిగి నోటిఫికేషన్‌ జారీచేసినట్టు ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో పాలసీ విడుదల చేసినప్పుడు 299 బార్లు మిగిలాయని, కొత్తగా గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రెండు బార్లకు లైసెన్సులు జారీచేయాలని నిర్ణయించామని వివరించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, హైబ్రిడ్‌ విధానాల్లో ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, 5న కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ విధానంలో లైసెన్స్‌లు మంజూరు చేస్తారని వివరించారు. ఎంపికైన వారికి అదే రోజున తాత్కాలిక లైసెన్స్‌ అందజేస్తారని తెలిపారు. ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎక్సైజ్‌ అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 04:51 AM